Today Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే.. రెండు రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. గురువారంతోపాటు శుక్రవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 530 రూపాయలు పెరిగింది. శుక్రవారం 43,370 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు అంటే శనివారం 43,900 ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 600 మేర పెరిగింది. నిన్న రూ.43,000 ఉన్న ధర ఈ రోజు 44,400గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 43,900 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,900 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,670 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,090 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,090 వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు 55 వేల మార్క్ దాటి పోయిన బంగారం ధరలు ప్రస్తుతం 42 వేలకు అటు ఇటుగా ఉన్నాయి.
Also Read: