
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. ధంతేరస్ వేళ బిగ్ షాక్ తగిలింది. పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ భారీ ఓటమి, క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూలుతుండటం, స్టాక్ మార్కెట్లలో జోష్ క్రమంలో బంగారంలోకి కూడా ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. దీంతో పాటు పండుగల కారణంగా బంగారం, వెండి ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ట్రంప్ ఓటమితో డాలర్ బలహీనపడుతోంది. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంటుంది. ఇవన్నీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశాలున్నాయనే వార్తలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నవంబర్ 6వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,030 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,030గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ1,46,180 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,010కు లభిస్తోంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,030 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,030 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా కొనసాగుతోంది.
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,10,100 వద్ద కొనసాగుతోంది. నిన్ ఈ రేటు రూ.2,10,000 వద్ద స్థిరపడింది\
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,09,900 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2,09,900 పలుకుతోంది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,09,900కే లభిస్తోంది
-బంగారంతో పోలిస్తే వెండి ధరలు కాస్త భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బంగారంతో పోలిస్తే వెండికి పారిశ్రామికపరంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ రంగం, డేటా సెంటర్లలో వెండి ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా పరిణామాలకు వెండి వేగంగా స్పందిస్తూ ఉంటుంది.