Gold Price Today: పసిడి ప్రియులకు అలెర్ట్.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు అలెర్ట్.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price

Updated on: Jan 29, 2023 | 6:33 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా, బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.400 మేర తగ్గి రూ.72,200 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,370 గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,440గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,200 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,200, చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200, బెంగళూరులో రూ.74,200, కేరళలో 74,200, కోల్‌కతాలో 72,200, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200, విజయవాడలో రూ.74,200, విశాఖపట్నంలో రూ.74,200 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us