
పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలకు రెక్కలొస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు.. స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమవ్వడంతో.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు యాభై వేలు మార్క్ చేరేలా పరుగులు పెట్టిన గోల్డ్ ధర.. ఇప్పడు వెనక్కి తగ్గింది. కరోనా ప్రభావంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు సుముఖత చూపకపోవడం.. మరోవైపు ధరలు కూడా బాగా పెరుగుతుండటంతో.. కొనగోళ్లు పడిపోయాయి. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతనమవడం కూడా కలిసొచ్చింది. దీని ఎఫక్ట్‌తో.. దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. MCXలో బుధవారం 10.గ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710కు చేరింది. మరోవైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి రూ.534 పతనమై రూ.34,882కు చేరింది.