
Gold Price: గత కొన్నాళ్లుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. గడిచిన కొన్ని నెలల్లో రికార్డు స్థాయి ధరలను నమోదు చేసిన బంగారం, ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం సామాన్యులకు ఊరటనిస్తోంది.
బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగినప్పటికీ నెమ్మదిగా కిందికి దిగుతూ వస్తున్నాయి. 2026 జనవరి నెలలో బంగారం ధర తులానికి రూ.1.85వేలకు చేరుకుంది. అంటే అక్కడి నుంచి సుమారు 31 వేల రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ 2025లో మాత్రం గోల్డ్ రేట్ 80 శాతం మేర పెరిగింది. అయితే తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర ప్రస్తుతం 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,53,980 వద్ద ట్రేడవుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,150 వద్ద కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర ఇంచుమించు రూ. లక్షా 50 వేల నుంచి లక్షా 55 వేల రూపాయల మధ్య కదలాడుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.3 లక్షల వరకు వెళ్లింది. అదే ఇతర ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?
1. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు: పశ్చిమ ఆసియాలో (ముఖ్యంగా ఇరాన్ – అమెరికా మధ్య) యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను కొంతమేర తగ్గించారు. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించినప్పటికీ, మార్కెట్ శక్తులు ప్రస్తుతానికి అనిశ్చితి తగ్గుతుందని అంచనా వేస్తున్నాయి.
2. ముడి చమురు ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు 3 శాతానికి పైగా పెరిగినప్పటికీ, రవాణా మార్గాలైన హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధత కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సాధారణంగా చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ భయంతో బంగారం ధర పెరుగుతుంది, కానీ ప్రస్తుతం డాలర్ బలోపేతం కావడం పసిడికి ప్రతిబంధకంగా మారింది.
3. లాభాల స్వీకరణ: 2026 జనవరి నెలలో బంగారం ధర తులానికి రికార్డు స్థాయిలో రూ.1.85 లక్షలకు చేరుకుంది. అక్కడి నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. భారీ లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తమ బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకోవడం (Profit Booking) కూడా ధరల తగ్గుదలకు కారణమైంది.
ఇది కూడా చదవండి: PM Modi Appeal: మోదీ పిలుపు వెనుక అసలు కథ.. గతంలో నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ కూడా ఇలాగే చేశారా?
ఇది కూడా చదవండి: Gold Buying: భారతీయులు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏమవుతుందో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి