Gold Loan: ఈ సింపుల్‌ ట్రిక్ తెలిస్తే.. వడ్డీ లేకుండానే గోల్డ్‌ లోన్ పొందవచ్చు!.. ఎలా అంటే?

మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడూ, లేదా అత్యవసర సమయాల్లో తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంక్‌లలో తాకట్టు పెట్టి లోన్స్ తెచ్చుకుంటారు. ఇందుకోసం వారు బ్యాంక్ వారికి వడ్డీ చెల్లిస్తారు. అయితే ఎలాంటి వడ్డి లేకుండా మనం గోల్డ్‌ను తాకట్టు పెట్టి రుణం పొందవచ్చనే విషయం మీకు తెలుసా? అయితే అదెలానో తెలుసుకుందాం పదండి.

Gold Loan: ఈ సింపుల్‌ ట్రిక్ తెలిస్తే.. వడ్డీ లేకుండానే గోల్డ్‌ లోన్ పొందవచ్చు!.. ఎలా అంటే?
Avoid Gold Loan Interest (1)

Updated on: Jan 15, 2026 | 12:09 PM

మధ్య తరగతి కుటుంబాల్లో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్య వచ్చినా.. ఇంట్లో ఉన్న బంగారం వారిని ఆదుకుంటుంది. అందుకే అప్పుచేసైనా బంగారం కొనాలని పెద్దలు అనేవారు. బంగారం భారతీయ సంప్రదాయానికి చిహ్నం మాత్రమే కాదు, మంచి పెట్టుబడి కూడా. మన దేశంలో చాలా మంది బంగారాన్ని ధరించడం కంటే.. ఫ్యూచర్‌లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని దానిపై ఇన్వెస్ట్ చేస్తారు. అలా భవిష్యత్తులో ఏవైనా అవసరాలు వస్తే వాటిని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటారు. దాని కోసం బ్యాంక్‌ వారికి వడ్డీ చెల్లిస్తారు. అయితే వడ్డీ లేకుండా కూడా గోల్డ్‌ తాక్కట్టు పెట్టి రుణం పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అవును ఒక ఆర్థికవేత్త అలాంటి ఒక అంశాన్ని వివరించారు. ఆయన ఏమి చెప్పారో వివరంగా చూద్దాం.

ఇది కూడా చదవండి:Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సాంపాదన.. ఈ ట్రెండీ బిజినెస్‌పై ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. రోజూ ఆధాయమే

గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ పొందండి

ఆర్థిక వేత్త ప్రేమ్ సోని తన X పేజీలో చేసిన పోస్ట్‌ ప్రకారం.. బ్యాంక్ లాకర్‌లో బంగారం ఉంచితే, బ్యాంక్ దివాలా తీసినప్పుడు DICGC ఇన్సూరెన్స్ (రూ. 5 లక్షల వరకు) వర్తించదు. కాబట్టి మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచాలంటే, గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఉపయోగించుకోవడం మంచి ఆప్షన్. ఇందులో బంగారాన్ని ప్లెడ్జ్ చేసి OD లిమిట్ తీసుకుంటారు. బంగారం బ్యాంకు వద్ద సురక్షితంగా ఉంటుంది, మీరు అవసరమైతే డబ్బు ఉపయోగించవచ్చు. బ్యాంక్ దివాలా వచ్చినా, ప్లెడ్జ్డ్ బంగారం మీద బ్యాంకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది.అయితే, ఏదైనా ఎక్స్‌ట్రీమ్ సిచుయేషన్‌లో రికవరీ ప్రాసెస్ ఉండవచ్చు. అందుకే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా బంగారాన్ని హోమ్ సేఫ్‌లో ఉంచడం కూడా ఆలోచించవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Holidays: ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్.. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్!

వడ్డీ లేకుండా రుణం ఎలా పొదాలి .

బ్యాంకులు మీ బంగారు ఆభరణాల మార్కెట్ విలువలో సాధారణంగా 70-75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్ ఇస్తాయి. ఈ సౌలభ్యం కోసం రూ. 500 నుంచి రూ. 10,000 వరకు (లేదా లిమిట్‌కు 0.25-0.5%) ప్రాసెసింగ్ ఫీజు + GST చెల్లించాలి. లిమిట్ సాంక్షన్ అయిన తర్వాత, మీరు అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు ఉపసంహరించుకోవచ్చు. మీరు ఉపసంహరించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. ఏ మొత్తం ఉపసంహరించకపోతే ఎటువంటి వడ్డీ లేదు.”ఇది చాలా ఖచ్చితమైనది. మీరు లోన్ తీసుకునే ముందు సమీపంలోని బ్యాంకు వద్దకు వెళ్లి లేటెస్ట్ రేట్లు, ఫీజులు చెక్ చేసుకోండి, ఎందుకంటే అవి కొద్దిగా మారవచ్చు.

ఇది కూడా చదవండి: టెక్నీషియన్ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే.. మీరు ఇంట్లోనే వాషింగ్ మెషీన్ సర్వీసింగ్ చేయొచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.