Gold Fixed Deposit Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా..? ఈ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందవచ్చు..!

|

Aug 20, 2021 | 9:58 AM

Gold Fixed Deposit Scheme: బంగారం అంటే చాలా మందికి మక్కువ. ప్రతి ఇంట్లో దాదాపు ఎంతో కొంత బంగారం ఉండే ఉంటుంది. బంగారం కలిగి ఉండటం వల్ల కలిగే ఇబ్బంది ఒక్కటే..

Gold Fixed Deposit Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా..? ఈ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందవచ్చు..!
Follow us on

Gold Fixed Deposit Scheme: బంగారం అంటే చాలా మందికి మక్కువ. ప్రతి ఇంట్లో దాదాపు ఎంతో కొంత బంగారం ఉండే ఉంటుంది. బంగారం కలిగి ఉండటం వల్ల కలిగే ఇబ్బంది ఒక్కటే. అది దాని భద్రత. బంగారం ఇంట్లో దాచుకుంటే భద్రత సమస్య రావచ్చు. బంగారం అంటే ఎంతో ముఖ్యమైన ఆస్తిగా పరిగణిస్తుంటారు. కొంత మంది దీని గురించి ఆలోచించే బ్యాంక్ లాకర్‌లో బంగారం దాచుకుంటూ ఉంటారు. బ్యాంకు లాకర్‌లోని వస్తువులకు ఎలాంటి హామీ ఉండదని గుర్తించుకోవాలి. బ్యాంకులో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసినా రూ.5 లక్షల వరకు డీఐసీజీసీ ఇన్సూరెన్స్ లభిస్తుంది. కానీ లాకర్ ద్వారా మాత్రం అలాంటి ప్రయోజనాలేమి ఉండవు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అందిస్తున్న గోల్డ్ డిపాజిట్ స్కీ్మ్‌లో పెడితే మంచిది. ఆర్బీఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అందిస్తోంది. ఇందులో మీ బంగారు ఆభరణాలు పెడితే రాబడి పొందే అవకాశం ఉంటుంది. కసం 10 గ్రాముల బంగారం దగ్గరి నుంచి డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఏడాది నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో మీరు బంగారం డిపాడిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో 2.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంకుకు వెళ్లి మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇక మెచ్యూరిటీ తర్వాత మీరు బంగారం, దాని విలువను డిపాజిట్‌ వడ్డీతో తిరిగి పొందవచ్చు.

ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా అనేక బ్యాంకులు ఆర్బీఐ గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని ట్విటర్‌లో ప్రచారం చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. మీ వద్ద ఉన్న బంగారు అభరణాలపై మీకు వడ్డీని చెల్లిస్తుంది. బ్యాంకులో గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి, దీర్ఘకాలిక డిపాజిట్లపై 2.50 శాతం, మీడియం టర్క్‌ డిపాజిట్లపై 2.25 శాతం వడ్డీని పొందండి అంటూ ట్వీట్‌ చేసింది.

గోల్డ్‌ మానిటైజేషన్‌ అంటే ఏమిటి..?

ఈ పథకాన్ని బంగారంలో ఫిక్స్‌డిపాజిట్‌ రూపంలో జమ చేయవచ్చు. భారతదేశంలో నివసించే ఎవరైనా సరే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. గోల్డ్‌ ఎఫ్‌డీని ఉమ్మడిగా కూడా ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద బంగారం నాణేలు, రత్నాలు, ఇతర లోహాలు మినహా బ్యాంకులు నగల రూపంలో ముడి బంగారాన్ని అంగీకరిస్తాయి.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1400 ప్రీమియంతో రూ.35 లక్షల వరకు పొందవచ్చు.. పూర్తి వివరాలు!