Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా..?

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా..?
పండుగ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత భగ్గుమనేలా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే బంగారం కొనాలంటేనే భారంగా మారిన మహిళలకు.. మున్ముందు గ్రాము కొనాలన్న కూడా కొనలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

Updated on: Jun 22, 2025 | 7:23 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. జూన్ 22 2025 ఆదివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 1,00,750 ఉండగా.. 22 క్యారెట్ల ధర 92,350 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,10,000లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,350 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,20,000లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,750 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్ల ధర రూ.92,500 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,750, 22 క్యారెట్ల ధర రూ.92,350 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,750 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,350 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,750, 22 క్యారెట్ల ధర రూ.92,350 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 లుగా ఉంది.

గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..