
Gold And Silver Rates: బంగారం రేట్లు గత కొంతకాలంగా భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆమాంతం పెరుగుతూ వస్తోండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతల ప్రభావం గోల్డ్ రేటుపై ప్రభావితం చూపిస్తోంది. ఈ కారణంతో పసడి ధరలు ఆకాశాన్నంటుతుండగా.. గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,38,260గా ఉండగా.. నిన్న ఈ ధర రూ.1,38,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,740గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,26,750 వద్ద స్థిరపడింది.
-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,260గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,26,740 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-అటు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,630 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,990 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ.1,28,000గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,38,260 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,740 వద్ద కొనసాగుతోంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,640 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,010గా ఉంది.
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,57,100 వద్ద కొనసాగుతోంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,77,100గా ఉంది
-చెన్నైలో కేజీ వెండి రూ.2,77,100 వద్ద కొనసాగుతోంది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,57,100 వద్ద కొనసాగుతోంది.