
పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలంగా రికార్డు స్థాయిలతో సామాన్యులకు చుక్కలు చూపించిన ధరలు.. ఇటీవల తగ్గుముఖం పట్టాయి.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం, మంగళవారం ధరలు పెరిగాయి.. రెండు రోజుల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.1000 మేర ధర పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి..
పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (జులై 22) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,44,230 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,32,210 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,44,230, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,210 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,44,380, 22 క్యారెట్ల ధర రూ.1,32,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,230, 22 క్యారెట్ల ధర రూ.1,32,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.144,230, 22 క్యారెట్ల ధర రూ.1,32,210 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,230, 22 క్యారెట్ల ధర రూ.1,32,210 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.