38 వేలకు బంగారం: వినియోగదారులకు షాక్

| Edited By:

Aug 07, 2019 | 10:20 AM

పసిడి ధరలు పరుగులు పెడుతోంది. మూడు నెలల్లో పదిగ్రాముల బంగారం దాదాపు రూ.5 వేలు పెరిగింది. శ్రావణమాసం రావడంతో ఇప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగింది. మళ్లీ కొనుగోళ్లు పెరిగాయి. జువెలరీ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో.. బంగారం ధర కూడా పెరుగుతోంది. తాజాగా.. బుధవారం బంగారం ధర.. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.430 పెరుగుదలతో రూ.38,040లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.34,870కు ఎగిసింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల […]

38 వేలకు బంగారం: వినియోగదారులకు షాక్
Follow us on

పసిడి ధరలు పరుగులు పెడుతోంది. మూడు నెలల్లో పదిగ్రాముల బంగారం దాదాపు రూ.5 వేలు పెరిగింది. శ్రావణమాసం రావడంతో ఇప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగింది. మళ్లీ కొనుగోళ్లు పెరిగాయి. జువెలరీ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో.. బంగారం ధర కూడా పెరుగుతోంది. తాజాగా.. బుధవారం బంగారం ధర.. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.430 పెరుగుదలతో రూ.38,040లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.34,870కు ఎగిసింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మరోవైపు వెండి రూ.5 తగ్గి కిలో రూ.44,522కు క్షీణించింది.