Gold Price Today: బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటను ఇచ్చాయి. గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఆదివారంతో పోల్చిలే బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనిపించింది. కాబట్టి సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold Price Today: బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?
Gold And Silver Prices Today

Updated on: Aug 10, 2026 | 6:32 AM

బంగారం కొనుగోలు చేసే వారికి ఇదో స్వల్ప ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. శనివారంతో పోల్చుకుంటే ఈ ఆభరణాల ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు.. పైగా ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ విలువ మారకం కారణంగా ధరల్లో ఈ మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే.. రూ.1,52,340 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఉదయం ఈ ధర రూ.1,52,350గా ఉంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640గా ఉండగా నిన్న ఈ ధర రూ.1,39,650 వద్ద కొనసాగింది. ఇక అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. శనివారంతో పోల్చుకుంటే వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,49,800గా ఉండగా నిన్న ఈ ధర రూ.2,49,900 వద్ద కొనసాగింది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇవే

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,540 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,840 వద్ద ట్రేడవుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,640 వద్ద ట్రేడవుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,990 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us