గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో నగరంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లతో సంబంధం లేకుండా పసిడి, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలపై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ముడుపరులు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో పసిడి ధరలు దేశంలో ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే దేశంలో బంగారం ధర ఈ రోజు (గురువారం) స్వల్పంగా పెరిగింది. 22క్యారెట్లు బంగారం 10 గ్రాములకు రూ. 10 పెరిగి.. ఈ రోజు రూ. 73,6610కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు ధర రూ. 10 లు పెరిగి రూ. 80,360కి చేరింది.
హైదరాబాద్ నగరంలో ఈ రోజు 22 క్యారెట్లు బంగారం ధర రూ. 73,6610లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర రూ. 80,360లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, వరంగల్ ల్లో కొనసాగుతున్నాయి.
దసరా, దీపావళి సమయంలో కిలో వెండి లక్ష రూపాయలు దాటింది. దీనికి కారణం బంగారం తర్వాత అత్యంత విలువైన లోహం వెండిగా పరిగణించడమే.. వెండిపై అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పెళ్లిల్లు, ఫంక్షన్లు వంటి సమయంలో వెండి వస్తువులను కానుకగా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఈ నేపధ్యంలో గురువారం కూడా వెండి ధర కొంత మేర తగ్గింది. ప్రస్తుతం దేశంలో అనేక నగరాల్లో కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 95,900లుగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,04,900లుగా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..