
Gold, Silver Prices: రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు బుధవారం అప్‌డేట్ అయ్యాయి. బంగారం, వెండిపై భారీగా పెరిగింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానముంది. ఈ మధ్య కాలంల నుంచి విపరీతంగా పెరుగుతున్న ధరలు.. ఇప్పుడు మరింతగా ఎగబాకింది. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై 870 రూపాయల వరకు పెరుగగా, అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై 800 రూపాయల వరకు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండిపై ఏకంగా 9 వేల రూపాయలు పెరిగింది.
దీనిబట్టి చూస్తే వెండికి ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది. వెండిని చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర పరికరాలలో సిల్వర్‌ను అధికంగా ఉపయోగిస్తుండటంతో బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ధర పెరిగిన తర్వాత వెండి కిలో ధర రూ.1,99,000 ఉంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,07,000 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Important Deadlines: డిసెంబర్ 31 లోపు ఈ 5 ముఖ్యమైన పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవు!
ఈ సంవత్సరం బంగారం ధరలు వేగంగా పెరగడం ప్రతి పెట్టుబడిదారుడిని ఆశ్చర్యపరిచింది. 2025లో బంగారం ధరలు 60 నుండి 67 శాతం పెరుగుతాయని, కొత్త రికార్డులను సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
ద్రవ్యోల్బణం,ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది.
ప్రస్తుత పెట్టుబడి వాతావరణం బంగారానికి అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా ఎక్కువగా ఉన్నందున, ఏకమొత్తం పెట్టుబడుల కంటే SIPలు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Most Expensive Car: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు ఏది? ధర తెలిస్తే షాక్ అవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి