Gold And Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త గోల్డ్ రేట్ వరుసగా రెండు రోజులు తగ్గుముఖం పట్టింది. బుధ, గురువారాల్లో కలిపి 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 280 తగ్గింది. అంతకుముందు భారీగా పెరిగిన గోల్డ్ రేట్ తగ్గుతుండడంతో గోల్డ్‌పై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. తాజాగా గురువారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంత తగ్గింది, ప్రస్తుతం ఎంత రేట్ ఉందన్న వివరాలు మీకోసం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 52,400 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,250 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,950 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 52,310 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,490 వద్ద ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 52,900 గా ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,250 గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,950 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 52,250 గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధర తగ్గుముఖం పట్టింది. గురువారం దేశంలోని అన్ని ప్రధాన నగారాల్లో సిల్వర్ రేట్స్ తగ్గాయి. ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,600, ముంబైలో రూ. 57,600, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,300 వద్ద కొనసాగుతుండగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 63,300 గానే ఉంది.