Gold Silver Price : ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine Russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 పడిపోయింది. దీంతో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 52,580కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.1,600 తగ్గుదలతో రూ. 48,200కు క్షీణించింది. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 పతనమైంది. దీంతో సిల్వర్ రేటు ఒక కిలోగ్రామ్ కు రూ. 74,100కు దిగి వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్ పుత్తడి 2,001 డాలర్లకు చేరింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 26.24 డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటివన్నీ ధరల్లో హెచ్చుతగ్గులకు కారణాలుగా చెప్పవచ్చు. పైన పేర్కొన్న ధరలకు జీఎస్‌టీ, ఇతర పన్నులు, వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు.
Also Read
UP Elections Results 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయానికి 10 ముఖ్యమైన కారణాలివే..!
ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్ వండేస్తున్నారు !! వీడియో