Telugu News Business Gold and Silver Price Today: November 24th 2022 Gold Silver Rates in Hyderabad Vijayawada Mumbai Delhi Chennai Today Gold News
Gold Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం, ధరలు స్వల్పంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం, ధరలు స్వల్పంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం, వెండి రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.48,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.100, 24 క్యారెట్లపై రూ.110 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,410గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,640 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.61,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500
బెంగళూరులో రూ.67,500
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500
విజయవాడలో రూ.67,500
విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.