Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, పసిడి, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.50,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,580 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.540 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.700 మేర పెరిగి రూ.72,000 కి పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,580 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500, బెంగళూరులో రూ.75,500, కేరళలో 75,500, కోల్‌కతాలో 72,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500, విజయవాడలో రూ.75,500, విశాఖపట్నంలో రూ.75,500 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..