Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గాయంటే..

|

Mar 22, 2025 | 6:31 AM

గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. స్వచ్ఛమైన బంగారం ధర 90 వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది. కిలో వెండి ధర లక్షా 12వేలకు చేరువైంది.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.

Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గాయంటే..
Gold Silver Price
Follow us on

గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. స్వచ్ఛమైన బంగారం ధర 90 వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది. కిలో వెండి ధర లక్షా 12వేలకు చేరువైంది.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. 22 మార్చి 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,690, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,02,900 గా ఉంది. దేశియంగా 10గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.

కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,690, 24 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,690, 24 క్యారెట్ల ధర రూ.90,210

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,840, 24 క్యారెట్ల ధర రూ.90,360 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,690, 24 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,690, 24 క్యారెట్ల రేటు రూ.90,210 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,690, 24 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది.

వెండి ధరలు..

  • హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,11,900
  • విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,900
  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.102,900 లుగా ఉంది.
  • ముంబైలో రూ.102,900 గా ఉంది.
  • బెంగళూరులో రూ.102,900లుగా ఉంది.
  • చెన్నైలో రూ.1,11,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..