
బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పదంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో డాలర్ బలపడి బంగారం ధర తగ్గుతోంది. మంళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా రూ.1,930 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,44,590 వద్ద కొనసాగుతుండగా , 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రైడవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
అయితే దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాలను బట్టి నగారల్లో ఎప్పకప్పుడూ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.కాబట్టి మీరు బంగారం, వెండి కొనే ముందు లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..