Gold And Silver Price Today (22-04-2022): భారతీయులకు బంగారానికి అవినావ భావ సంబంధం ఉంది. తమ జీవితంలో వచ్చే ప్రతి స్పెషల్ డే కి బంగారం, వెండి (Gold and Silver Ornaments ) వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం కూడా ఓ స్టేటస్ గా భావిస్తారు. గతంలో భారతీయులు (Indians) తమ వద్ద ఉన్న బంగారం ఎప్పుడైనా అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే.. తమను గట్టెక్కిస్తుందని భావించేవారు.. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు బంగారాన్ని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. అయితే దేశీయంగా బంగారం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు.. దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి. నిన్న పసిడి ధర కొంతమేర దిగి వస్తే.. నేడు మళ్ళీ పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు (శుక్ర వారం) బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ ఆర్నమెంట్ కి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర నేడు మార్కెట్ లో గ్రాముకి రూ. 15ల మేర పెరిగి.. రూ. 4,930 లకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 ల మేర పెరిగి రూ.49,300 గా కొనసాగుతోంది.
24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకు 16 ల మేర పెరిగి.. నేడు రూ. 5,378లు గా ఉంది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 160 మేర పెరిగి.. రూ. 53,780 గా ఉంది.
ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది.
చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.49,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,960గా ఉంది.
వెండి ధర: ఓ వైపు పసిడి ధరలు పరుగెడుతుంటే.. వెండి ధర మాత్రం తగ్గుతోంది. ఈరోజు కూడా వెలవెలబోయింది. వరసగా మూడో రోజు వెండి ధర తగ్గింది. వెండి రూ.300 క్షీణించింది. దీంతో దీని రేటు కేజీకి రూ.73 వేలకు తగ్గింది. గత మూడు రోజులుగా వెండి ధర తగ్గుతుండడంతో.. ధర ఏకంగా రూ.2,200 మేర దిగివచ్చింది.
Also Read: Gujarat: గుజరాత్ పోర్ట్‌లో 260 కిలోల డ్రగ్స్ సీజ్.. రూ. 1,300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా