Gold and Silver Price: కొద్దిగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

|

Apr 21, 2021 | 7:29 AM

Gold and Silver Price Today: 2020 కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి..

Gold and Silver Price: కొద్దిగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: 2020 కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి భారీగా కేసులు నమోదవుతున్నా.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయీఅనుకునే సమయంలో గత నాలుగురోజుల నుంచి క్రమంగా పసిడి ధర పైకి వెళ్తోంది. వరుసగా 4 రోజులపాటూ మొత్తం రూ.600 పెరిగిన బంగారం ధర నిన్న కొద్దిమేర రూ.110 మాత్రమే తగ్గింది. తాజాగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. ఈరోజు ఉదయానికి రూ. 100 తగ్గి రూ.44,150కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160 లు గా ఉంది. నిన్న ధర రూ.110 తగ్గింది.  ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం ల్లో కూడా ఉన్నాయి.

ఇక బంగారంతో పాటు భారతీయ సంప్రదయం లో వెండికి ప్రాముఖ్యత ఉంది. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెండి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. వెండి ధర నిన్న రూ. 600 కొద్ది మేర తగ్గినా గత 20 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.6,300 పెరిగింది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.73,600 ఉంది.

అయితే వెండి ధరను గత 6 నెలల నుంచి పరిగణలోకి తీసుకుంటే.. అప్పుడప్పుడు తగ్గుతున్నా మొత్తానికి చూస్తే వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు కేజీ వెండి రూ.73,600 ఉంది. అంటే ఈ ఆరునెలల్లో వెండి కేజీకి భారీ గా రూ.11,600 పెరిగిందన్నమాట.. పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు.. తాజా మార్కెట్ పై ఓ అంచనాకి రావాల్సిందా నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  టీడీపీకి నారాలోకేష్ అనే వైరస్ పట్టిందన్న ఆర్జీవీ.. దాని నివారణకు ఏకైక టీకా ఇదేనంటూ ట్వీట్

చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ మరో బృహత్కార్యానికి శ్రీకారం.. రేపటి నుంచి సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్