Gold & Silver Price Today (July 21st): బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈరోజు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110లు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 నుంచి రూ..46,400 కి పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50, 510 నుంచి రూ.50,620కి పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. 100 గ్రాముల వెండిపై రూ. 300 పెరిగి రూ. రూ.55, 900కు చేరుకుంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.
☛హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46, 400గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50, 620పలుకుతోంది
☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 620 వద్ద కొనసాగుతోంది.
☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 620 వద్ద ఉంది.
☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 920పలుకుతోంది.
☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.
☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46, 400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.50, 620 పలుకుతోంది.
☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,620కు లభిస్తోంది.
☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46.450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 పలుకుతోంది.
☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50.620 వద్ద ఉంది.
వెండి ధరలు..
గురువారం వెండి ధరలు బంగారం బాటలోనే పయనించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.55, 900 పలుకుతోంది.
గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..