Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Dec 02, 2024 | 6:53 AM

పండగల సీజన్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయింది. దీంతో మార్కెట్ అంతా వినియోగదారులతో కళకళాడుతోంది. ముఖ్యంగా బంగారు నగల షాప్స్ నిత్యం రద్దీతో సందడిగా మారాయి. పెళ్ళిళ్ళ సందర్భంగా బంగారం , వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు(డిసెంబర్ 2వ తేదీ) తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us on

భారతీయులు పసిడి ప్రియులు. పండగలు, పర్వదినాలు, పెళ్ళిళ్ళు అంటూ ఏదోక సందర్భంలో అంటే ఏడాది పొడవునా బంగారం, వెండిని కొనుగోలు చేస్తూనే ఉంటారు. దీంతో మన దేశం బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉంటుంది. ప్రాతాలను బట్టి బంగారం ధరలు వేరు వేరుగా ఉంటాయి. దేశంలో రాష్ట్రాలను బట్టి బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం పెట్టుబడిదారులు బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో దేశంలో నిన్నటితో పోల్చితే ఈరోజు (డిసెంబర్ 2వ తేదీ సోమవారం) 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ. 7,1490లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 7,7990. లు గా ఉంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలతో పాటు.. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు ధర రూ.77,990 స్థాయికి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రేటు రూ. 71,490లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు ఏపీ, తెలంగాణాలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, పొద్దుటూరు, కరీంనగర్, వరంగల్ నగరాల్లో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు 10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  1. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 77,990 ఉండగా.. 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 71,490లుగా కొనసాగుతోంది.
  2. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 78, 140, ఉండగా.. 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 71,640 ఉంది.
  3. బెంగళూరులో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 77,990, ఉండగా.. 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 71,490 ఉంది.
  4. చెన్నైలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 77,990, 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 71,490
  5. కేరళలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 77,990, 22 క్యారెట్స్ పసిడి ధర రూ.. 71,490

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దీంతో వెండి ధర కూడా కిలోకు 100 రూపాయల మేర తగ్గింది. ఈ నేపధ్యంలో ఈ రోజు (డిసెంబర్ 2 వ తేదీ సోమవారం) వెండి ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో లక్ష దిగువకు చేరుకుంది. ఈ రోజు కిలో వెండి రూ. 99,900 కొనసాగుతోంది. అయితే డిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగలూరు వంటి నగరాల్లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 91,400లుగా కొనసాగుతోంది.