Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.?

గోల్డ్ ప్రియులకు గోల్డెన్ న్యూస్ అంటే ఇది.. దీపావళికి ముందు గోల్డ్ రేట్స్‌లో తగ్గుముఖం కనిపిస్తోంది. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరల్లో.. ఇవాళ స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ధరలు ఎలా ఉన్నాయో..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.?
Gold Price
Image Credit source: Getty Images

Updated on: Oct 28, 2024 | 7:44 AM

దీపావళికి ముందుగా గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ వచ్చేసింది. భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయ్. గత రెండు రోజులుగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరిగ్గా.. 22 క్యారెట్ల బంగారం రూ. 750 మేరకు పెరిగింది. ఇక ఆదివారంతో పోలిస్తే.. సోమవారం బంగారం ధరల్లో వ్యత్సాసం కనిపిస్తోంది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీపావళికి ముందు ఇలా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో.. గోల్డ్ లవర్స్ కొనుగోలు సిద్దమయ్యారనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తున్నాయ్. సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.73,590

విజయవాడ – రూ.73,590

బెంగళూరు – రూ.73,590

ముంబై – రూ.73,590

కోల్‌కతా – రూ.73,590

ఢిల్లీ – రూ.73,740

చెన్నై – రూ.73,590

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.80,280

విజయవాడ – రూ.80,280

బెంగళూరు – రూ.80,280

ముంబై – రూ.80,280

కోల్‌కతా – రూ.80,280

ఢిల్లీ – రూ.80,430

చెన్నై – రూ.80,280

వెండి ధరల్లో..

బంగారం ధరలు బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. సోమవారం వెండి కేజీకి రూ. 100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1.06.900 ఉండగా.. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి రూ. 97,900గా.. బెంగళూరులో కేజీ వెండి రూ. 96,900గా ఉంది.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..