Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.?

|

Jul 08, 2024 | 8:17 AM

బంగారం ధరలు కాస్త శాంతించాయి. గత వారం రోజులుగా సుమారు రూ. 1400 మేరకు పెరిగిన గోల్డ్ రేట్.. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆదివారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. సోమవారం స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.?
Gold Rate
Follow us on

బంగారం ధరలు కాస్త శాంతించాయి. గత వారం రోజులుగా సుమారు రూ. 1400 మేరకు పెరిగిన గోల్డ్ రేట్.. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆదివారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. సోమవారం స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పైపైకి ఎగబాకడంతో.. ఆ ప్రభావం దేశీయంగా గోల్డ్ రేట్స్‌పై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాగే గోల్డ్ కొనాలనుకునేవారు.. పసిడి మరింత పైపైకి ఎగబాకక ముందే.. కొనేస్తే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,640 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 73, 790 దగ్గర ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,640గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790గా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు కూడా బంగారం ధరల మాదిరిగానే షాక్ ఇస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా వెండి సుమారు రూ. 4800 మేరకు పెరిగింది. అయితే ఈ రెండు రోజులుగా ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 99,200 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. మరోసారి ధరలను చెక్ చేసుకోవడం బెటర్. ఇక ఈ బంగారం ధరలు గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కావాలంటే 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..