Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?

|

Aug 22, 2024 | 6:00 AM

గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు రోజుల లెక్కలు చూస్తే.. ఏకంగా రూ. 1000 పెరిగింది గోల్డ్ రేట్. నిన్నటి ధరతో పోలిస్తే.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?

Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
Gold Price
Follow us on

గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు రోజుల లెక్కలు చూస్తే.. ఏకంగా రూ. 1000 పెరిగింది గోల్డ్ రేట్. నిన్నటి ధరతో పోలిస్తే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం(ఆగష్టు 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200గా ఉంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,200గా ఉంది. ఇక విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,210గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,250 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా కొనసాగుతోంది.

బంగారం ధర అలా ఉంటే.. వెండి ధర మాత్రం తగ్గుతోంది. బుధవారం ధరతో పోలిస్తే గురువారం కేజీ వెండి రూ. 100 మేరకు తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.86,900గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ86,900 ఉండగా.. చెన్నైలో రూ.91,900గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,900గా.. హైదరాబాద్‌లో రూ.91,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.91,900 వద్ద కొనసాగుతోంది.