Gold Rate Today: అబ్బ.. గురువారం దిగొచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులంపై ఎంత తగ్గిందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి పరుగులు పెడుతోంది. ఊహించనంతగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి.. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..? సామాన్యులకు అందుబాటులో బంగారం లేకపోతే.. మున్ముందు కొనుగోళ్లు తగ్గుతాయా.? భవిష్యత్‌లో బంగారం ధరలు పతనం కాబోతున్నాయా..?

Gold Rate Today: అబ్బ.. గురువారం దిగొచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులంపై ఎంత తగ్గిందంటే..
Gold Price Today

Updated on: Sep 25, 2025 | 11:37 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి పరుగులు పెడుతోంది. ఊహించనంతగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి.. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..? సామాన్యులకు అందుబాటులో బంగారం లేకపోతే.. మున్ముందు కొనుగోళ్లు తగ్గుతాయా.? భవిష్యత్‌లో బంగారం ధరలు పతనం కాబోతున్నాయా..? బంగారం అమ్మకానికి ఇదే సరైన సమయమా..? అనే సందేహాలు నెలకొన్నాయి.. అయితే.. మున్ముందు లక్షా 20 వేలకు ధరలు టచ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. కొన్నిరోజుల నుంచి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లక్షా 15 వేల మార్క్ దాటి.. ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే.. వెండి ధరలు కూడా పసడి బాటలోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి.. అయితే.. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. తాజాగా, పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నా్యి.. సెప్టెంబర్ 25 2025 గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.930 మేర ధర తగ్గి.. రూ.1,12,150 గా ఉంది.
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 మేర ధర తగ్గి.. రూ.1,04,900 లకి చేరుకుంది.
  • వెండి కిలో ధర రూ.1,40,000లుగా ఉంది.
  • అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,14,440 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,900 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,14,440 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,900 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,000 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,590, 22 క్యారెట్ల ధర రూ.1,05,050 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,40,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,440, 22 క్యారెట్ల ధర రూ.1,04,900 ఉంది. వెండి ధర కిలో రూ.1,40,000 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,660 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,05,100 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,50,000 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,14,440, 22 క్యారెట్ల ధర రూ.1,04,900 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,42,600 ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us