
బంగారం ధరలు రోజురోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచంలో ఉన్న బంగారం ధరలపై మాత్రమే కాదు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో ఆధారపడి ఉంటాయి. ఈ రోజు విలువైన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బంగారం తర్వాత వెండి ప్రాచీన కాలం నుంచి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. దీనిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ రోజు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య వివాహ వేడుకల్లో సైతం బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెండి కొనేముందు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ కొంత మేర దిగి వచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,09,800లు గా కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..