Business Idea: తక్కువ పెట్టుబడితో భారీగా లాభాలు.. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా

|

Nov 07, 2024 | 5:08 PM

సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? ఉన్న ఊరిలోనే ఉంటూ.. భారీగా లాభాలు ఆర్జించాలని ఆశపడుతున్నారా.? అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీ కోసమే. ఇంతకీ ఏంటీ బిజినెస్‌.? ఇది ప్రారంభించేందుకు ఎంత ఖర్చవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Business Idea: తక్కువ పెట్టుబడితో భారీగా లాభాలు.. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా
Business Idea
Follow us on

గజిబిజీ జీవితంలో ఇన్‌స్టాంట్ వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. కారం నుంచి పసుపు వరకు అంతా ఇన్‌స్టాంట్ కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. అంతా ఇన్‌స్టాంట్‌ మయం అయిపోతుంది. ఇలాంటి వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒకటి. ఇదిగో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. ఇంతకీ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ చేయడానికి ప్రత్యేకంగా ఒక గది అవసరపడుతుంది. షటర్ ఉండే గదిని అద్దెకు తీసుకోవాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొన్ని రకాల మిషనరీలు కావాల్సి ఉంటుంది. వీటిలో ప్రధానమైనవి.. క్రషర్‌, ప్రెజర్‌ వాటర్ పంప్‌,వెల్లుల్లి పొట్టు తీసి మిషిన్‌, ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ మిషిన్‌ కూడా అవసరపడుతుంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభంచేందుకు అల్లం, వెల్లుల్లిని కొనుగోలు చేయాలి.

మంచి నాణ్యతతో కూడిన అల్లం, వెల్లుల్లితో నాణ్యమైన పేస్ట్‌ వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిషిన్ల ధర విషయానికొస్తే రూ. 50 వేల నుంచి రూ. లక్షన్నర వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక మిషినరీ కొనుగోలు చేసిన తర్వాత.. అల్లంవెల్లులిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అల్లం, వెల్లుల్లిని శుభ్రం చేసిన తర్వాత వాటిని గ్రైండింగ్‌ చేయాలి. పేస్ట్‌ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు కొంత పసుపును కూడా కలుపుకోవచ్చు. రడీ అయిన పేస్ట్‌ను చిన్న చిన్న ప్యాకెట్స్‌ మొదలు, బాటిల్స్‌లో నింపి మీ సొంత బ్రాండింగ్‌తో విక్రయించుకోవచ్చు.

సుమారు రూ. 5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే తక్కువ కెపాసిటీతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక లాభాల విషయానికొస్తే.. ఆన్‌లైన్‌తో పాటు దుకాణాల్లో నేరుగా కూడా విక్రయించుకోవచ్చు. ఇక లాభాల విషయానికొస్తే.. మీరు చేసుకునే మార్కెటింగ్ ఆధారంగా నెలకు కనీసం రూ. 30 వేల నుంచి లాభాలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..