చేతిలో డబ్బు ఉంటే రకరాలక మార్గాలను అన్వేషిస్తుంటారు. ఆ డబ్బును ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో కొందరు భూములు కొనుగోలు చేస్తే, మరికొందరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. అయితే ఏ రకంగా చూసుకున్న ఇలాంటి కాస్త రిస్క్‌తో కూడుకున్న అంశాలని చెప్పాలి. అలాకాకుండా ఎలాంటి రిస్క్ లేకుండా, మీ డబ్బుకు భద్రతతో పాటు ప్రతీ నెల మంచి ఆదాయం పొందే మార్గం ఉంటే ఎలా ఉంటుంది. మీలాంటి వారి కోసమే పోస్టాఫీస్‌లో ఒక మంచి పథకం అందుబాటులో ఉంది.
సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెడితే ప్రతీ నెల వడ్డీ తీసుకోవడం కుదరదు. అయితే పోస్టాఫీస్ అందిస్తోన్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో మాత్రం ప్రతీ నెల మీరు వడ్డీని తీసుకొవచ్చు. ఈ పథకం ఉద్యోగ విరమణ పొందిన వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో ఎంత డిపాజిట్ చేయొచ్చు.? ఎంత వడ్డీ లభిస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీస్ అందిస్తోన్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒక ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్టంగా 5 సంవత్సరాల వరకు పోస్టాఫీస్ MISలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.4 శాతంగా అందిస్తున్నారు. మీరు పెట్టుబడి పెట్టిన దానికి వచ్చే వడ్డీని ప్రతీ నెల విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీరు జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. దీంతో మీకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఏడాదికి మీకు రూ. 1.11 లక్షలు వడ్డీ రూపంలో లభిస్తుంది. ఐదేళ్ల వ్యవధికి మీరు డిపాజిట్ చేస్తే మీకు మొత్తం వడ్డీ రూపంలోనే రూ. 5,55,000 పొందుతారు. ఈ లెక్కన మీకు నెలకు రూ. 9250 వస్తుంది. ప్రతీ నెల అయ్యే ఖర్చులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అదే సింగిల్ ఖాతాలో ఒక వ్యక్తి రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 5,550 పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..