Gautam Adani: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ(30 Trillion Economy)గా ఎదగాలని ఆకాంక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అలా అభివృద్ధి చెందితే దేశంలో ఎక్కడా ఆకలి కేకలు(Starvation) ఉండవని అన్నారు. ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సిన పరిస్థితి ఉండదని.. పేదరికం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. 2050 సంవత్సరాన్ని చేరుకోవటానికి ఇంకా 10 వేల రోజులు ఉందంటూ.. ఈ లోగా దేశ ఆర్థిక వ్యవస్థకు 25 ట్రిలియన్ డాలర్లను జోడించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది మన జీడీపీకి 2.5 బిలియన్ డాలర్లను అదనంగా జోడిస్తుందని చెప్పారు. ఈ కాలంలోపు దేశంలోని అన్ని రూపాల్లో ఉన్న పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందితే.. 2050 నాటికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు అది దాదాపు 40 ట్రిలియన్ డాలర్లను జోడిస్తుందని అన్నారు. 1.4 బిలియన్ల జీవితాలను మార్చటం స్వల్పకాలంలో మారథాన్‌గా అనిపించవచ్చు.., కానీ దీర్ఘకాలంలో ఇది స్ప్రింట్ అని అదానీ అన్నారు. 2050 నాటికి రూ. 2250 లక్షల కోట్ల (30 ట్రిలియన్ డాలర్లు) ఆర్ధిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యాన్ని మన దేశం అందుకుంటే.. దేశంలో ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించని దేశంగా మారుతుందని గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు.
ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. భారత జీడీపీకి ప్రతి రోజూ 250 కోట్ల డాలర్ల సంపద జతవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే దేశంలో అన్ని రూపాల్లో ఉన్న పేదరికం తొలగిపోతుందని అనుకుంటున్నట్లు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గౌతమ్ అదానీ అన్నారు. ఈ 10,000 రోజుల్లో స్టాక్ మార్కెట్లలోని కంపెనీల మార్కెట్ విలువ కూడా 3 వేల లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల సంపద రోజుకు 30 వేల కోట్ల మేర పెరగాలని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి..
Google CEO: సుందర్ పిచాయ్‌కు షాకిచ్చిన గూగుల్.. ఈ ఇండియన్ సీఈవోకే ఎందుకిలా..