Vayve Eva: గడ్కరీ మనస్సు దోచిన గడసరి కారు.. ప్రత్యేకతలు ఏంటంటే?

భారతదేశ ఆటో మొబైల్ రంగం ప్రస్తుతం ఆటో ఎక్స్‌పో-2025పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఎక్స్‌పో తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి టాప్ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కేంద్ర మంత్రి ఇటీవల ఓ ఈవీ కారుపై మనస్సు పడ్డారు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఎంతో అనువుగా ఉంటుందని సంబరపడ్డారు. ఈ ఆటో ఎక్స్‌పో ఆ కారు కూడా ప్రదర్శనకు రానుంది.

Vayve Eva: గడ్కరీ మనస్సు దోచిన గడసరి కారు.. ప్రత్యేకతలు ఏంటంటే?
Vayve Eva

Updated on: Jan 18, 2025 | 4:24 PM

వాయవే ఎవ కంపెనీ తన కొత్త ఈవీ కారు ఎవాను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్‌తో పాటు ఫీచర్లలో ఈ కారు తన ప్రత్యేకతను కనబరుస్తుంది. ముఖ్యంగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే  ఎవా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల మాదిరిగానే ఉంటుంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఎవా డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే క్వాడ్రిసైకిల్ లాంటి డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈవీ మార్కెట్‌లో చిన్నకారుగా ఉన్న ఎంజీ కామెట్ కంటే ఎవా కారు కొంచెం పొడవుగా ఉంటుంది. పొడవైన వీల్‌బేస్‌ను ఈ కారు ప్రత్యేకతగా ఉంటుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ కారు త్రీ-సీటర్ వాహనం. డ్రైవర్ సీటు అన్ని కార్లకు ఉన్న మాదిరిగానే ఉన్నా డ్రైవర్ పక్కన సీటు మాత్రం లేదు. అయితే కొనుగోలుదారులు కావాలంటే సీటును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేలా ఖాళీ స్థలం ఉంది. 

ఎవా డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్‌తో కొన్ని ఉపయోగకరమైన ఫీచర్‌లతో వస్తుంది. అయితే ఎవా కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఆకట్టుకుంటుంది. చిన్న కారులో పనోరమిక్ సన్‌రూఫ్ అనేది ఉండదు. కానీ ఎవా ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ముఖ్యంగా సోలార్ రూఫ్ అంటే ఈ రూఫ్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది. అంటే సోలార్ రూఫ్‌తో మీరు సంవత్సరానికి 3000 కిమీలు నడపవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఎవా ఈవీ కారు కాబట్టి చాలా మంది ఈ కారు రేంజ్ విషయంలో భయపడుతూ ఉంటారు. ఎవా కారు ఒకే ఛార్జ్‌పై 250 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సౌరశక్తితో నడిచే కారు కాబట్టి సంవత్సరానికి 3000 కిమీ వరకు దూసుకుపోవచ్చు. ఎవా 14 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీతో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగతంతో దూసుకుపోతుంది.  ఎవా ఈవీ కారు ద్వారా కిలోమీటర్‌కు రూ. 0.5 కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించివచ్చు. అయితే ఈ కారు ధర మాత్రం అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి