
గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చిన్నతనం నుంచి అందరూ వినే ఉంటారు. ఎంతో మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల్లో గుడ్డు ముందు ఉంటుంది. అలాంటి గుడ్డు గురించి కొన్ని రోజులుగా పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందంటూ.. గుడ్లను క్యాన్సర్‌కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసింది. దేశంలో లభ్యమవుతోన్న గుడ్లు సురక్షితమైనవి అంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాటిల్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో గుడ్డపై ఉన్న డౌట్లు అన్ని ఒక్క దెబ్బకు క్లిక్ అయిపోయాయి.
మన దేశంలో విక్రయించే గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటబాలైట్స్‌ను గుర్తించినట్లు కొన్నిరోజులుగా పలు పోస్టులు వెలుగులోకి వచ్చాయి. 2011లో తీసుకువచ్చిన ఆహార భద్రత నిబంధలన ప్రకారం.. పౌల్ట్రీ, ఎగ్ ప్రొడక్షన్ జరిగే అన్ని దశల్లో నైట్రోఫ్యూరాన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి