Credit Score: ఒకే ఒక్క క్లిక్‌తో ఉచితంగా క్రెడిట్ స్కోర్.. జస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..

ప్రతీ వ్యక్తికి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. మీ ఆర్ధిక పరిస్థితిని దీని ద్వారా సులువుగా అంచనా వేయవచ్చు. మీ ఆర్ధిక పరిస్థితి బాగుందా.. లేక ఇబ్బందుల్లో ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. అయితే ఉచితంగా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. అదెలా అంటే..

Credit Score: ఒకే ఒక్క క్లిక్‌తో ఉచితంగా క్రెడిట్ స్కోర్.. జస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..
Cibil Score

Updated on: Jun 18, 2026 | 1:54 PM

బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు ఏ బ్యాంక్ లోన్ మంజూరు చేయదు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు కూడా రాదు. మీ ఆర్ధిక క్రమశిక్షణను క్రెడిట్ స్కోర్ తెలియచేస్తుంది. మీకు లోన్ కోసం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ముందుగా ఆర్ధిక సంస్థలు మీ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. మినిమం 700 వరకు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మీకు మంజూరు కావడం కష్టమే. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్‌ను పరిశీలించుకుంటూ ఉండటం కూడా ముఖ్యమే. దీని వల్ల మీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు.

ఉచితంగా సిబిల్ స్కోర్ పొందటం ఎలా..?

మీరు ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు క్రెడిట్ బ్యూరో సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. జస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు. మీరు ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పాన్ నెంబర్ ఎంటర్ చేశాక పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. అనంతరం సబ్‌మిట్ క్లిక్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ మొత్తం వచ్చేస్తోంది. అందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు వివరాలు, రీపెమెంట్ కెపాసిటీ, ఫైనాన్షియల్ క్రెడిబులిటీ లాంటి వివరాలు అన్నీ ఉంటాయి. సిబిల్, ఆక్వాఫిక్స్, క్రిఫ్ హై మార్క్, ఎక్స్‌పీరియన్ అనే సంస్ధల వెబ్ సైట్ల ద్వారా ఉచితంగా చెక్ చేసుకోవచ్చు.

సమాచారం ఎలా తెలుస్తుంది..?

ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు ఖాతాదారుడికి సంబంధించిన ప్రతీ సమాచారాన్ని వారం రోజులకు ఒకసారి సిబిల్ వంటి బ్యూరో సంస్థలకు పంపాల్సి ఉంటుంది. దీంతో ఆ సమాచారం ఆధారంగా మీ సిబిల్ స్కోర్‌ను బ్యూరోలు అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఇక పేటీఎం, గూగుల్ పే, ఫోన్ ఫే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు. 700కిపైగా క్రెడిట్ స్కోర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండటం ముఖ్యం. అప్పుడే మీకు సులువుగా లోన్లు మంజూరు అవుతాయి. అంతకంటే తక్కువుంటే ఆలస్యం జరుగుతుంది. తక్కువ స్కోర్ ఉంటే కొన్ని బ్యాంకులు ఎక్కడ వడ్డీ రేట్లతో లోన్ మంజూరు చేస్తారు. దీంతో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే ఈఎంఐలు డ్యూ డేట్ కల్లా చెల్లించండి. లోన్ల కోసం ఎక్కువ బ్యాంకుల్లో దరఖాస్తులు పెట్టుకోవద్దు.

Follow Us