
Free Bus Service: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ప్రయాణికులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ‘పింక్ కార్డ్‌లను’ జారీ చేసింది. గతంలో కేవలం 50 కేంద్రాల్లోనే ఈ కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కేంద్రాల సంఖ్యను 58కి పెంచారు.
లక్ష్యానికి మించి కార్డుల జారీ:
ప్రస్తుతం ఢిల్లీలో ప్రతిరోజూ దాదాపు 12,500 పింక్ కార్డ్‌లు జారీ అవుతున్నాయి. ఇది మునుపటి లక్ష్యం (10,000) కంటే ఎక్కువ. మే 31వ తేదీ నాటికి ఢిల్లీలోని అర్హులైన మహిళలందరికీ ఈ కార్డులను అందజేయాలని ఢిల్లీ రవాణా సంస్థ (DTC) లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ప్రస్తుతం మీ దగ్గర కార్డు లేకపోయినా, పాత పద్ధతిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!
ఇంటి నుండే రిజిస్ట్రేషన్ – క్యూలో నిలబడాల్సిన పనిలేదు:
మహిళల సౌకర్యార్థం ఈ ప్రక్రియను ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ‘సహేలి పింక్ కార్డ్’ పొందడానికి మహిళలు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మొబైల్ ద్వారా QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. OTP వెరిఫికేషన్ తప్పనిసరి. ఆధార్, మొబైల్ నంబర్ ఓటీపీల ద్వారా గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వచ్చే QR కోడ్‌ను సమీపంలోని కేంద్రంలో చూపిస్తే చాలు. తక్షణమే మీ పింక్ కార్డ్ మీ చేతికి అందుతుంది.
ఒక గంట నిబంధనపై క్లారిటీ:
పింక్ కార్డ్ వినియోగంపై మహిళల్లో ఒక చిన్న అపోహ ఉంది. ఒక బస్సు దిగిన తర్వాత మరో బస్సు ఎక్కాలంటే గంట సేపు ఆగాలనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఢిల్లీ రవాణా సంస్థ (DTC) డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR) అమన్ దేవ్ చికారా ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. ఒక మహిళ ఒక బస్సు దిగి వెంటనే మరో బస్సు ఎక్కితే, ఆమె తన పింక్ కార్డును ఉపయోగించి ఎటువంటి ఆటంకం లేకుండా టిక్కెట్‌ను పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ పరిమితి కేవలం ఒకే బస్సులో కార్డును పదేపదే ట్యాప్ చేయడానికి మాత్రమే వర్తిస్తుందని ఆయన అన్నారు. ఇది కార్డు దుర్వినియోగం కాకుండా పెట్టిన నిబంధన మాత్రమేనని తెలిపారు.
మహిళా ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు:
ఆర్థిక వెసులుబాటు: ఉచిత ప్రయాణం వల్ల నెలవారీ ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. అలాగే డిజిటల్ కార్డు ఉండటం వల్ల బస్సులో కండక్టర్ కోసం వేచి చూడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. ఇక భద్రత విషయంలో ఈ కార్డుల ద్వారా మహిళా ప్రయాణికుల డేటా ఉండటం వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. ఢిల్లీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు గొప్ప ఉపశమనం లభించనుంది. మీకు ఇంకా కార్డు అందకపోతే, వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్ రేట్లు!
ఇది కూడా చదవండి: Bank Account: ఖాతాదారులకు చివరి అవకాశం.. ఏప్రిల్ 16 లోపు ఈ పని చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవ్వడం ఖాయం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి