
దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అవసరం. మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే జీతం పొందాలన్నా లేదా బ్యాంకులో రూ.50 వేలకు మించి డిపాజిట్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డు అవసరం. ఇంతకాకుండా అనేక ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందేందుకు ఓ గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పాన్ కార్డు అవసరమవుతుంది. అందుకే పాన్ కార్డును ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే పాన్ కార్డు నెంబర్‌ను మార్చిపోతే ఎలా తెలుసుకోవాలి..? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఆధారంగా ఎలా పాన్ నెంబర్ తెలుసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
-ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-రిజిస్టర్డ్ బటన్ క్లిక్ చేయండి
-ఇప్పటికే అకౌంట్ ఉంటే మీ లాగిన్స్ ఉపయోగించండి
-ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నా ఖాతాను ఎంపిక చేయండి
-పాన్ వివరాలు విభాగంలోకి వెళ్లండి
-అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, స్థితి, చిరునామా వంటి వివరాలు తెలుసుకోవచ్చు
-ఈ ఫైలింగ్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేయండి
-క్వింక్ లింక్స్ చోట ఇన్‌స్టంట్ ఈ పాన్ ఆప్షన్‌ను ఎంచుకోండి
-చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి కొనసాగించండి
-మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-ఆ తర్వాత కొనసాగించండి బటన్‌పై క్లిక్ చేయండి
-మీ ఆధార్ నెంబర్ ఆధారంగా పాన్ కార్డు నెంబర్ దర్శనమిస్తుంది
మీ శాలరీ ప్లే స్లిప్‌లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్లలో పాన్ కార్డ్ నెంబర్ ముద్రించి ఉంటుంది. దీంతో వాటి ద్వారా కూడా మీ పాన్ నెంబర్ సులువుగా తెలుసుకోవచ్చు. ఇక గతంలో మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆధారంగా పాన్ కార్డు నెంబర్ తెలుసుకునే అవకాశముంది.