Forex Reserves: భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. వరుసగా ఐదోవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీనికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) కొత్త మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను(Interest Rates) పెంచటం వల్ల ఆ ప్రభావం డాలర్ రేటుపై పడుతోందని నిపుణులు అంటున్నారు. దేశంలో రిజర్వు బ్యాంక్ కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి సారించటం కూడా దీనికి మరోకారణంగా తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం విదేశీ మారక నిల్వలు వారం వ్యవధిలో 2.47 బిలియన్ డాలర్లు తరిగిపోయి ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరల కారణంగా బ్యారెల్ చమురు 100 డాలర్లకు పైగా పెరగటంతో నిల్వలు వేగంగా తరిగిపోవడానికి మరో కారణంగా నిలిచింది. 85 శాతం దేశీయ ఇంధన అవసరాలకోసం దిగుమతులు చేసుకుంటున్నందున భారత్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటోంది. దీనికి తోడు డారర్ బలపడటం కారణంగా ఫారెక్స్ నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
వరుసగా 5 వారాల నుంచి విదేశీ మారక నిల్వలు పడిపోవటం వల్ల భారత్ వద్ద ఈ కాలంలో 30 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్ 2021 సమయంలో భారత్ వద్ద 642.453 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండాగా.. అవి 6 శాతం మేర తగ్గాయి. ఈ తరుగుదల కారణంగా భారత సెంట్రల్ బ్యాంక్ వద్ద ఆరునెలల కాలంలో 40 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న 600 బిలియన్ డాలర్ల విదేదీ మారక నిల్వలు.. రానున్న 12 నెలల దేశ దిగుమతులకు చెల్లింపులు చేసేందుకు సరిపోతాయి. కానీ ఆర్బీఐ మాత్రం ఫారెక్స్ నిల్వలను మ్యానేజ్ చేయగలనని ధీమాగా ఉంది.
ఇవీ చదవండి..
Anand Mahindra: టాటాలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి.. అలా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వినతి..
Electric Scooters: దేశంలో తొలిసారిగా ఈ-స్కూటర్ల రీకాల్.. వాహనాలను వెనక్కి రప్పించనున్న కంపెనీ