Flipkart Sale: : రూ.1 కే ఎలక్ట్రిక్ స్కూటర్… కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. కానీ ఆఫర్ వారికి మాత్రమేనట..

వ్యాలెంటైన్స్ వీక్ సేల్‌లో పాల్గొన్న కస్టమర్లల్లో ఒకరికి రూ.1 కే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తామని ప్రకటిస్తూ సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే మాత్రం కొన్ని షరత్తులను విధించింది.

Flipkart Sale: : రూ.1 కే ఎలక్ట్రిక్ స్కూటర్… కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. కానీ ఆఫర్ వారికి మాత్రమేనట..
Flipkart

Updated on: Feb 13, 2023 | 5:30 PM

ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. కేవలం ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కొనుగోలు మాత్రమే పరిమితమవ్వకుండా వివిధ ఉత్పతులను కంపెనీ తమ సైట్స్ లో అమ్మకానికి ఉంచుతున్నారు. సమయానికి తగిన ఆఫర్లను ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకోడానికి ఈ కామర్స్ సైట్‌లు పోటీ పడుతుంటాయి. ఇలాంటి పోటీలో ఎప్పుడూ ముందు ఉండే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారు ముందుకొచ్చింది. వ్యాలెంటైన్స్ వీక్ సేల్‌లో పాల్గొన్న కస్టమర్లల్లో ఒకరికి రూ.1 కే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తామని ప్రకటిస్తూ సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే మాత్రం కొన్ని షరత్తులను విధించింది. ఆ షరత్తులేంటో? రూ.1 కే స్కూటర్‌ను పొందాలంటే ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ వ్యాలెంటైన్ వీక్‌లో పాల్గొన్న తన కస్టమర్ల కోసం రూ.1 కే ఒకాయ కంపెనీకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందించనుంది. ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బి స్కూటర్‌ను వ్యాలెంటైన్ వీక్‌లో పాల్గొన్న దాదాపు 1,40,223 మంది కస్టమర్లలో ఎవరికో ఒకరికి ఈ స్కూటర్‌ను అందిస్తామని పేర్కొంది. వ్యాలెంటైన్ వీక్ సేల్ ఇంకా కొనసాగుతుంది. కాబట్టి వినియోదారులకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విజేతల వివరాలను ఓ నెలలో పేర్కొంటామని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే ఒకాయ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. రూ. 5వేల వరకూ తగ్గింపును కస్టమర్లకు అందింస్తుంది. ఫ్రీడమ్ ఎల్ఐ 2, ఫాస్ట్ ఎఫ్2బి, ఫాస్ట్ ఎఫ్ 4 మోడల్స్ స్కూటర్స్‌పై తగ్గింపు ధర అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఎఫ్2బి స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే దీని గరిష్ట వేగం గంటలకు 70 కిలోమీటర్లని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us