Flipkart Big Saving Days: ఇంట్లోకి కొత్త వస్తువు కొనాలనుకుంటున్నారా.? భారీ డిస్కౌంట్స్‌ వచ్చేస్తున్నాయి. గెట్‌ రడీ..

20222కి గుడ్‌ బై చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాపార సంస్థలు సైతం వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆన్‌లైన్‌ షాపింగ్ ప్రియులను ఆకర్షించే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను నిర్వహిస్తోంది. కొత్తేడాది వెల్‌కమ్‌ చెబుతూ..

Flipkart Big Saving Days: ఇంట్లోకి కొత్త వస్తువు కొనాలనుకుంటున్నారా.? భారీ డిస్కౌంట్స్‌ వచ్చేస్తున్నాయి. గెట్‌ రడీ..
Flipkart Big Saving Days

Updated on: Dec 16, 2022 | 6:25 AM

20222కి గుడ్‌ బై చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాపార సంస్థలు సైతం వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆన్‌లైన్‌ షాపింగ్ ప్రియులను ఆకర్షించే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను నిర్వహిస్తోంది. కొత్తేడాది వెల్‌కమ్‌ చెబుతూ ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. సేల్‌లో భాగంగా మునుపెన్నడూ లేని భారీ ఆఫర్లను అందించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది.

స్మార్ట్‌ఫక్షన్‌ మొదలు అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఆరు రోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్‌షిప్‌ సభ్యులు ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 15వ తేదీ నుంచే ఆఫర్లను పొందొచ్చు. భారీ డిస్కౌంట్‌లతో పాటు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై కొనుగోలు చేసే వారికి 5 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌బాక్‌ను సైతం అందిస్తోంది.

ఈ సేల్‌లో ఐఫోన్‌13పై భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఐఫోన్‌ 13 (128 జీబీ) వేరియంట్‌ ధర రూ. 63,999 కాగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌పై రూ. 17,500 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ డిస్కౌంట్‌ కింద రూ. 3000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇలా అన్ని ఆఫర్లను కలుపుకుంటే ఐఫోన్‌ 13ని కేవలం రూ. 42,499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషిన్లపై కూడా భారీ ఆఫర్లను అందించనున్నారు. గృహోపకరాణలపై ఏకంగా 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us