Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ వచ్చేస్తోంది.. వీటిపై 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌.!

Flipkart Big Billion Days: ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ప్రతీ ఏటా బిగ్‌ బిలియన్ పేరుతో సేల్‌ నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా..

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ వచ్చేస్తోంది.. వీటిపై 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌.!

Updated on: Sep 13, 2021 | 7:03 PM

Flipkart Big Billion Days: ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ప్రతీ ఏటా బిగ్‌ బిలియన్ పేరుతో సేల్‌ నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా రకరకాల గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా 2021 ఏడాదికి గాను ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే తేదీలు ప్రకటించకపోయినప్పటికీ త్వరలోనే సేల్‌ ఉండనుందని తెలిపింది.

ఈ ఏడాది స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్లెట్స్‌, టీవీలు, వాషింగ్ మెషిన్లతో పాటు మరికొన్ని గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా తెలిపింది. సెప్టెంబర్‌ చివరిలో కానీ అక్టోబర్‌ మొదట్లో కానీ ఈ సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి మరింత డిస్కౌంట్‌లు లభించనున్నాయి. అలాగే పేటీఎమ్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి క్యాష్‌ బ్యాక్‌ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోట్‌ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌, స్మార్ట్‌ వాచ్‌లపై 70 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. ఇక డిజో బ్రాండ్‌పై 60 శాతం, ఇంటెల్‌ ల్యాప్‌టాప్స్‌ను 40 శాతం డిస్కౌంట్‌తో ఉండనున్నట్లు సమాచారం. ఇక సామ్‌సంగ్‌, ఒప్పో, వివోలతో పాటు ఐఫోన్‌ 12 సిరీస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ 2020 వంటి ఫోన్‌లపై కూడా భారీగా డిస్కౌంట్‌లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ విడుదల చేసిన టీజర్‌ ప్రకారం ఆడియో డివైజ్‌లు, వాచ్‌లు, ల్యాప్‌టాప్స్‌, ఆరోగ్యానికి సంబంధించిన గ్యాడ్జెట్లపై డిస్కౌంట్‌లు అందించనున్నట్లు తెలిపింది. మరి మీరు కూడా ఏదైనా గ్యాడ్జెట్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే మొదలయ్యేంత వరకు వేచి ఉండడమే బెస్ట్‌.

Also Read: Viral Photo: ఈ ఫోటో దాగున్న చిరుతను మీరు గుర్తించగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Viral News: ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాలు.. మాజీ ప్రియుడికి షాకిచ్చిన ప్రేయసి.. అసలేం జరిగిందంటే.!

Success Story: లక్క సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు.. నక్సలిజం నుంచి ఆధునిక వ్యవసాయం వైపు..