ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్.. డిస్కౌంట్లు చూస్తే నోరెళ్లాబెట్టాల్సిందే..

Flipkart Big Billion Days 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ప్రతిష్టాత్మక బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 తేదీలను అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా ఈ మెగా సేల్ ప్రారంభం కానుండగా, స్పెషల్ మెంబర్లకు ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించనుంది. బ్యాంక్ కార్డులపై 10శాతం డిస్కౌంట్లతో పాటు పాటు వేటిపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్.. డిస్కౌంట్లు చూస్తే నోరెళ్లాబెట్టాల్సిందే..
Flipkart Big Billion Days Sale 2026 1

Updated on: Sep 16, 2026 | 4:23 PM

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్ వచ్చేశాయి. ఈ మెగా సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను లైవ్ చేస్తూ, బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల వివరాలను వెల్లడించింది. సాధారణ యూజర్ల కంటే ఒక రోజు ముందుగానే ప్లస్ మెంబర్స్‌కు ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ , ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ 24 గంటల ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ప్రధాన సేల్ ప్రారంభం కాకముందే పరిమిత స్టాక్ ఉండే హాట్ డీల్స్‌ను దక్కించుకునే అవకాశం వీరికి దక్కుతుంది.

బ్యాంక్ ఆఫర్లు – క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు

మైక్రోసైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం కస్టమర్లకు భారీ ఆర్థిక రాయితీలు లభించనున్నాయి.

తక్షణ డిస్కౌంట్: యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై గరిష్టంగా 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డు వినియోగదారులు అదనంగా 10 శాతం వరకు పొదుపు చేయవచ్చు.

సూపర్ మనీ : మొదటి లావాదేవీపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నారు.

యూపీఐ, ఇతర ప్రముఖ పేమెంట్ గేట్‌వేల ద్వారా చెల్లింపులు జరిపే వారికి సైతం ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఉంటాయని సంస్థ తెలిపింది.

ఏయే విభాగాల్లో భారీ తగ్గింపులు?

నిర్దిష్ట ఉత్పత్తుల వారీగా ఇంకా ధరలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లైయన్స్‌పై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు స్పష్టమైంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఆడియో డివైజ్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ ఉండనున్నాయి.

ఐఫోన్, శాంసంగ్ డీల్స్

కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి బిగ్ బిలియన్ డేస్ సేల్ అత్యుత్తమ వేదిక కానుంది.

ఆపిల్ ఐఫోన్లు: ఇటీవల ఆపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో మునుపటి మోడళ్లయిన ఐఫోన్ 16, ఐఫోన్ 17 సిరీస్‌లపై అదిరిపోయే ప్రైస్ కట్స్ వచ్చే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ: శాంసంగ్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌పై కూడా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ధరల తగ్గింపు ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత నెలకొన్నందున కొన్ని ఫోన్ల లభ్యత, తుది ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సేల్ ప్రారంభ సమయం దగ్గరపడే కొద్దీ నిర్దిష్ట ప్రోడక్ట్ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ఒక్కొక్కటిగా రివీల్ చేయనుంది. పండుగ సీజన్ షాపింగ్ కోసం వినియోగదారులు ఇప్పటి నుంచే తమ విష్‌లిస్ట్‌లను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us