Today Silver Price: దేశీయంగా వెండి ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి శుక్రవారం కూడా తగ్గింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో వెండి ధర వెనుకంజ వేస్తోంది. శుక్రవారం దేశీయంగా కిలో వెండిపై రూ.1500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,900 ఉంది.
అలాగే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా.. హైదరాబాద్‌లో రూ.72,900 ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ.68,950 ఉంది. ఇక చెన్నైలో రూ.72,900, ముంబైలో 68,950, కోల్‌కతాలో రూ.68,950, బెంగళూరులో రూ.68,800, విజయవాడలో రూ.72,900 ఉంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా