Savings bank account: లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. పరిమితి దాటితే పన్ను బాదుడు షురూ..!

భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం డిజిటల్ విప్లవం కొనసాగుతుంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చి యూపీఐ చెల్లింపులు కారణంగా లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే బ్యాంకు ఖాతా నిర్వహణలో చేసే కొన్ని తప్పుల వల్ల ఆదాయపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

Savings bank account: లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. పరిమితి దాటితే పన్ను బాదుడు షురూ..!
Savings Bank Account

Updated on: Apr 18, 2025 | 5:10 PM

దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయంటే ప్రజలు తమ ఆర్థిక నిర్వహణ కోసం పొదుపు బ్యాంకు ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని అర్థం. అయితే ఆ ఖాతాలకు ఆర్థిక పరిమితి ఉందని అది దాటితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రజలు ఒక ఆర్థిక సంవత్సరంలో తమ పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల వరకు నగదు జమ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ పరిమితిని మించిపోవడం వల్ల ఆటోమెటిక్‌గా పన్ను విధించరు. అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాత్రం నోటీసులు ఇస్తారు. వార్షిక సమాచార రిటర్న్ (ఏఐఆర్) ఫ్రేమ్‌వర్క్ కింద బ్యాంకులు అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. మీ డిపాజిట్లు రూ. 10 లక్షల పరిమితిని దాటితే ఆ నిధుల మూలాన్ని మీరు వివరించాల్సి ఉంటుంది.

మూలాన్ని అధికారులకు నివేదించడంతో ఇబ్బందులు ఎదురైతే ఆ మొత్తంపై 60 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బ్యాంకుల్లో  రూ. 50,000 వరకు నగదు డిపాజిట్ల కోసం మీరు మీ పాన్ కార్డును చూపించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని మించిన ఏదైనా లావాదేవీ చేయాలంటే కచ్చితంగా పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల లెక్కించని సంపదను పర్యవేక్షించడానికి, అలాగే బ్యాంకింగ్ మార్గాల ద్వారా సంభావ్య మనీలాండరింగ్‌ను అరికట్టడానికి వీలు అవుతుంది. అలాగే ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా డిజిటల్ కెమెరాలు వంటి అధిక-విలువ కొనుగోళ్లకు రసీదులు, ఇన్‌వాయిస్‌లను నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 

ఆదాయపు పన్ను అంచనాల సమయంలో ఈ రికార్డులు కీలకమైన డాక్యుమెంటేషన్‌గా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి అలాంటి వస్తువుల విలువ మీరు నివేదించిన ఆదాయానికి అసమానంగా కనిపించినప్పుడు. మీ పొదుపు ఖాతాలో డబ్బు ఉంచుకోవడం పూర్తిగా చట్టబద్ధమైనదే అయినప్పటికీ నియంత్రణా సరిహద్దుల్లోనే ఉండటం చాలా ముఖ్యం. ఆదాయ పత్రాలకు మద్దతు లేకుండా అకస్మాత్తుగా పెద్ద మొత్తాలు రావడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. సురక్షితంగా ఉండటానికి ఆదాయ వనరుల స్పష్టమైన వివరాలను మీ వద్ద ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు మీ పన్ను రిటర్న్‌లలో ఎల్లప్పుడూ అధిక విలునవైన లావాదేవీలను వెల్లడించడం మంచిది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..