
అవును, మీరు చదివింది నిజమే.. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే పలు రకాల సేవలు అందిస్తోంది. అయితే, ఇప్పుడు మరో కొత్త రకం ఆఫర్‌తో ప్రజల ముందుకు వచ్చింది. ఉచితంగా రూ.21 వేలు, రూ.11 వేలు, రూ.5 వేలు మేర అందిస్తోంది. ఈ బహుహతులు కేవలం పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులే కాదు ప్రజలు కూడా ఈ నగదు బహుమతి గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ పోటీ సాధారణ పౌరుడిని EPFO గుర్తింపు, లక్ష్యంతో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత, నమ్మకం, సాధికారత విలువలను ప్రతిబింబించే ట్యాగ్‌లైన్‌లను సూచించమని ప్రజలను కోరారు. పోటీ విజేతలకు EPFO నుండి ప్రశంసా పత్రం, EPFO వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అదనంగా, సెకండ్ AC రైలు ప్రయాణం, హోటల్ వసతి కల్పించబడుతుంది.
* ఈ పోటీలో EPFO మొత్తం మూడు బహుమతులను ప్రకటించింది –
– మొదటి బహుమతి: రూ. 21,000.
– రెండవ బహుమతి: రూ. 11,000.
– మూడవ బహుమతి: రూ. 5,100.
EPFO ఈ పోటీని mygov ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రారంభించింది. ఆసక్తిగల పార్టీలు తమ ట్యాగ్‌లైన్‌ను mygov.in వెబ్‌సైట్‌లో సమర్పించాలి. వెబ్‌సైట్ ప్రకారం, ఈ పోటీ లక్ష్యం EPFO లక్ష్యాన్ని ప్రదర్శించడం, అంటే సామాజిక భద్రతను నిర్ధారించడం, కార్మిక వర్గానికి సాధికారత కల్పించడం, సభ్యులందరికీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడం.
ईपीएफओ टैगलाइन प्रतियोगिता में हिस्सा लेने का अंतिम दिन आज, आपके शब्द बन सकते हैं हमारी पहचान!#EPFO #EPFOWithYou #HumHainNa #ईपीएफओ #epfotaglinecontest@mansukhmandviya @ShobhaBJP @LabourMinistry @MIB_India @PIB_India @mygovindia @narendramodi @PMOIndia pic.twitter.com/C7C5niM1kK
— EPFO (@officialepfo) October 10, 2025
* మీరు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:
1. ట్యాగ్‌లైన్ హిందీలో ఉండాలి.
2. ఒక వ్యక్తి ఒక ట్యాగ్‌లైన్‌ను మాత్రమే సమర్పించవచ్చు.
3. ట్యాగ్‌లైన్ EPFO దృష్టిని ప్రతిబింబించాలి – సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, నమ్మకంపై ప్రాధాన్యత. .
4. ChatGPT లేదా Grok వంటి AI సాధనాలతో సృష్టించబడిన ట్యాగ్‌లైన్‌లు ఆమోదించబడవు.
5. ఎలాంటి అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఆమోదించబడదు.
EPFO ట్యాగ్‌లైన్ కాంటెస్ట్ పోటీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరింది. ఈమేరకు ఈపీఎఫ్ఓ (EPFO) ట్విటర్ అధికారిక ఖాతాలో పోస్టు చేసింది. కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం Mygov.in అధికారిక వెబ్‌సైట్ సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి