EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త.. వీరి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. చెక్ చేస్కోండి.

మీ పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా..? ఇనాక్టివ్ అకౌంట్లో డబ్బులు అలాగే చిక్కుకుపోయాయా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నగదు కోసం మీరు క్లెయిమ్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లో పడనున్నాయి.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త.. వీరి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. చెక్ చేస్కోండి.
Epfo

Updated on: Nov 06, 2026 | 2:15 PM

ప్రైవేట్ సంస్దల్లో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా(EPF) అనేది ఉంటుంది. మీ జీతంలో 12 శాతం కట్ చేసి ఇందులో జమ చేస్తే.. ఎంప్లాయర్ చందా కింద మీ కంపెనీ యాజమాన్యం కూడా అందుకు సమానమైన వాటా అందిస్తుంది. ఇందులో కొంతమొత్తం ఎంప్లాయర్ చందా కింద జమ అయితే.. 8 శాతం వరకు పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే కొంతమంది కంపెనీలు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ ఖాతా గురించి మర్చిపోతుంటారు. ఆ ఖాతాల్లో ఉండే సొమ్మును విత్ డ్రా చేసుకోరు. చిన్న మొత్తాలే కదా అని వదిలేస్తుంటారు. అయితే మూడేళ్ల పాటు మీరు పీఎఫ్ ఖాతాను అలాగే వదిలేస్తే ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్‌గా మారుతూ ఉంటుంది. ఇనాక్టివ్ అయిన అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకోడం కుదరదు. మళ్లీ తిరిగి అకౌంట్ యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆటోమేటిక్‌గా అకౌంట్లోకి డబ్బులు

అయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ అయిన ఖాతాదారుల అకౌంట్లలోని సొమ్మును ఆటోమేటిక్‌గా సెటిల్మెంట్ చేయనుంది. ఖాతాదారుడు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వీటిని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఇనాక్టివ్ అయిన ఖాతాల్లోని సొమ్మును క్లియర్ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇనాక్టివ్ అయిన అకౌంట్లో రూ.వెయ్యి వరకు నగదు ఉంటే మాత్రమే ఆటోమేటిక్‌గా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. పీఎఫ్‌ రికార్డుల్లో నమోదైన బ్యాంక్ అకౌంట్లోకి వీటిని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్ఓ తాజాగా ప్రారంభించింది. రూ.వెయ్యి లేదా అంతకంటే తక్కువ అమౌంట్ ఉంటే ఇది వర్తిస్తుంది. ఆపైన ఉన్న నగదుకు ప్రస్తుతం ఉన్న విధానంలో క్లెయిమ్ సమర్పించాల్సి ఉంటుంది.

అకౌంట్ ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుంది..?

ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు, అతడి గుర్తింపు వివరాలు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ అందిస్తారు. సుమారు 100,000 PF ఖాతాలకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుండగా.. సుమారు 5 కోట్ల రూపాయలు జమ అవుతాయని అంచనా. పీఎఫ్ అకౌంట్లో మూడేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా, కాంట్రిబ్యూషన్లు జమ కాకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. 1952 EPF రూల్స్ ప్రకారం.. ఒక సభ్యుడు పదవీ విరమణ చేసిన తర్వాత వరుసగా మూడు సంవత్సరాల పాటు చెల్లింపులు అందకపోతే ఆ ఖాతాను నిష్క్రియ ఖాతాగా పరిగణిస్తారు. ఇలాంటి అకౌంట్ నుంచి మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోలేరు.

Loading...
Unable to load recommendations.
Follow Us