EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్బ్ న్యూస్.. కంపెనీ మారితే నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్.. సింపుల్‌ ప్రాసెస్ ఇదే..

మీరు ఒక కంపెనీ నుంచి కంపెనీకి మారాలా.. అయితే ఇది మీ కోసమే. మీరు కంపెనీ మారినప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను కూడా కొత్త కంపెనీలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ద్వారా ఇది సులువుగా చేసుకోవచ్చు. అదెలా అంటే..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్బ్ న్యూస్.. కంపెనీ మారితే నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్.. సింపుల్‌ ప్రాసెస్ ఇదే..
Epfo Updates

Updated on: Apr 12, 2026 | 8:22 AM

ఈపీఎఫ్‌వో విషయంలో ఖాతాదారులకు అనేక అనుమానాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు మారడం అనేది సాధారణంగా జరుగుతున్నాయి. ఇలా కంపెనీ నుంచి మరోక కంపెనీకి మారినప్పుడు మీ పీఎఫ్ నిల్వలను కూడా కొత్త కంపెనీలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డబ్బులను సలువుగా విత్ డ్రా చేసుకోవచ్చు. చాలామంది కొత్త కంపెనీలోకి పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోరు. దీని వల్ల క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇది ఎలా చేయాలి..? ఒక కంపెనీ నుంచి మరోక కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది? లాంటి అనేక విషయాలు చూద్దాం.

ఎన్ని రోజుల సమయం పడుతుందంటే..?

ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరోక కంపెనీకి బదిలీ చేయాలంటే 7 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కేవైసీ పూర్తి చేయకపోవడం, మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఆమోదించడంలో ఆలస్యం చేయడం లాంటి కారణాల వల్ల కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టే అకకాశముంది. దీంతో మీరు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాక ఒకసారి మీ కంపెనీ హెచ్‌ఆర్‌ని సంప్రదించి సమాచారం అందించండి. దీని వల్ల ప్రాసెస్ మరింత వేగంగా పూర్తవుతుంది. లేకపోతే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశముంటుందని చెప్పవచ్చు.

ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే..?

-ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్ సైట్లోకి వెళ్లి మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

-ఆ తర్వాత హోమ్ పేజీలో ఆన్ లైన్ సర్వీసెస్ ఎంచుకోవాలి

-వన్ మెంబర్-వన్ ఈపీఎఫ్ అకౌంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి

-మీ వ్యక్తిగత వివరాలు వెరిఫై చేసుకోవాలి

-గెట్ డీటైల్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఇంతకముందు పనిచేసిన కంపెనీ వివరాలు వస్తాయి.

-పాత కంపెనీ లేదా కొత్త కంపెనీని ఏదొకటి ఎంచుకోవాలి

-మీ పీఎఫ్ ఐడీ, యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి

-గెట్ ఓటీపీపై క్లిక్ చేసి ఓటీపీ నమోదు చేయాలి

-ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి

ఇవి చూసుకోండి

మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. యూఏఎన్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్, బ్యాంక్ వివరాలు, పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ వంటివి నమోదై ఉండాలి. ఇక మీ కేవైసీని ఎంప్లాయర్ అప్రూవ్ చేసి ఉండాలి.

స్టేటస్ చేసుకోవడం ఎలా..?

మీరు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాక స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్ లైన్ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని కనిపిస్తే.. మీ కంపెనీ యాజమాన్యం అనుమతి పొందాక ఓకే అవుతుంది.

Follow Us