Electric Scooter: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ రేంజ్‌.. పూర్తి వివరాలు ఇవి..

|

Jul 27, 2023 | 4:00 PM

మన దేశంలోని మధ్యప్రదేశ్‌కు చెందిన ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్‌8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవడంతో పాటు సింగిల్‌ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

Electric Scooter: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ రేంజ్‌.. పూర్తి వివరాలు ఇవి..
Enigma Ambier N8
Follow us on

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఎరా ప్రారంభమైందనే చెప్పాలి. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్‌లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్‌ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇదే తరహాలో మన దేశంలోనే కూడా విద్యుత్‌ శ్రేణి వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది. అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇండియన్‌ మార్కెట్లో ఎక్కువగా సేల్‌ అవుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. టాప్‌ బ్రాండ్లతో పాటు స్టార్టప్‌ లు కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలోని మధ్యప్రదేశ్‌కు చెందిన ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్‌8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవడంతో పాటు సింగిల్‌ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ యాంబియర్

ఎనిగ్మా యాంబియర్ ఎన్‌8 ధర.. యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్‌8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది – గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఎనిగ్మా యాంబియర్ ఎన్‌8 ఫీచర్లు.. యాంబియర్ ఎన్‌8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది. స్కూటర్ ఎనిగ్మా ఆన్ కనెక్ట్ యాప్ ద్వారా అనేక ఫీచర్లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

అధిక రేంజ్‌.. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కో-ఫౌండర్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ బోహ్రే మాట్లాడుతూ, యాంబియర్‌ ఎన్‌8 స్కూటర్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అదే రేంజ్‌ విషయం. ఈ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌ పై 200 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్‌ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంజినీర్ల బృందాన్ని ‍ప్రత్యేకంగా అభినందించారు. వారి నిబద్ధత, కృషితోనే యాంబియర్‌ ఎన్‌8 మార్కెట్లోకి రావడం జరిగిందని వెల్లడించారు. వినియోగదారులు దీనిని ఒకసారి టెస్ట్‌ డ్రైవ్‌ చేసి స్వయంగా స్కూటర్‌ పనితీరు, ఫీచర్లను తెలుసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..