Atal Beemit Vyakti Kalyan Yojana: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి తీపి కబురు అందించింది. అటల్ బీమిత్ వ్యక్తి కళాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నిర్వహిస్తున్న అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాల్యాణ్ యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 2022 జూన్ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఉపాధి కోల్పోయిన వారు అలవెన్స్ పొందవచ్చు. అయితే పరిస్థితులు ఇంకా అలానే కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. ఇప్పుడు జూలై 1, 2021 నుంచి జూన్ 30, 2022 వరకు పొడిగించింది.
ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ మెడికల్ ఫెసిలిటీ 6 నెలల వరకు కొనసాగుతుంది. ఈ పథకం కింద ఈఎస్‌ఐసీ లబ్దిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు వేతనంలో సగం డబ్బులను అందిస్తారు. ఈ మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారు మళ్లీ ఉద్యోగం సంపాదించుకుంటే సరిపోతుంది. ఇబ్బందులు ఉండవు. ఈ పథకం కింద నిరుద్యోగి అయిన తర్వాత ప్రభుత్వం గరిష్టంగా 90 రోజులు అంటే మూడు నెలలు ఆర్థిక సహాయం అందిస్తుంది.
కోవిడ్ -19 వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోయిన నేపథ్యంలో బీమా వ్యక్తులకు మూడు నెలల పాటు 50 శాతం వేతనంతో ఈ పథకం ద్వారా నిరుద్యోగ భృతి అందుకోవచ్చు.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) 185వ సమావేశంలో అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజనను జూన్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో కర్ణాటకలోని హర్హోలి, నరసాపూర్‌లో 100 పడకలతో రెండు కొత్త ఈఎస్‌ఐసీ ఆస్పత్రులు, కేరళలో ఏడు కొత్త ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలు, ఇతర వాటి కోసం ఐదు ఎకరాల భూమిని సేకరించేందుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఇలా మోడీ ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగే పథకాలు ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే రకరకాల పథకాలను తీసుకువస్తే ఆర్థికంగా వృద్ధి చెందేలా చేస్తోంది. నిరుద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇలా అన్ని వర్గాల వారికి మేలు కలిగించే పథకాలను రూపొందిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాల వల్ల ఎందరో లబ్ది పొందారు.
श्री भूपेंद्र यादव, श्रम एवं रोजगार मंत्री, भारत सरकार की अध्यक्षता में 10.09.2021 को ईएसआईसी की 185वीं बैठक सम्पन्न हुई। श्री रामेश्वर तेली, श्रम एवं रोजगार तथा पेट्रोलियम एवं प्राकृतिक गैस राज्य मंत्री, भारत सरकार बैठक में उपाध्यक्ष के तौर पर उपस्थित रहे।#ESIC @byadavbjp pic.twitter.com/R3WZmMeI97
— ESIC #StayHome #StaySafe (@esichq) September 11, 2021