Dogecoin: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది. కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్ కాయిన్స్‌ను అనుమతించబోమని గురువారం ఉదయం మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 17 శాతం వరకు జారిపోయింది. మస్క్ ట్వీట్‌కు ముందు బిట్ కాయిన్ 54,819 డాలర్లు కాగా, ట్వీట్ తర్వాత 45,700 క్షీణించింది. మార్చి 1వ తేదీ తర్వాత బిట్ కాయిన్ ఇంతలా పడిపోవడం తొలి సారి.
మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే…
మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల స్థాయికి పడిపోవడంతో అంతా ఆ ప్రభావం మొత్తం క్రిప్టోకరెన్సీపై కూడుతుదని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్ కోసం శిలాజ ఇంధనాల్ని ముఖ్యంగా ఎక్కువగా ఉద్గారాలను వెలువరిచే బొగ్గు వాడకంపై ఆందోళన చెందుతున్నామని ఎలాన్ మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. చాలా అంశాల్లో క్రిప్టోకరెన్సీ మంచి ఆలోచనేనని, కానీ పర్యావరణానికి ముప్పుగా మారటం సరికాదన్నారు. ఈ ఎలాన్ మస్క్ ట్వీట్ బిట్ కాయిన్ పై భారీగా పడింది.
అందుకే బిట్ కాయిన్ జంప్ తమ కార్లు కొనుగోలు చేసేవారు బిట్ కాయిన్ రూపంలో చెల్లించవచ్చునని ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో ఆఫర్ చేశారు. అంతేకాదు, ఇందుకోసం 1.5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు కూడా పెట్టారు. వీటిని టెస్లా కొనుగోలు చేసింది. అప్పటి నుంచి బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ఇది 60 వేల డాలర్ల మార్కును దాటుందని చాలా మంద్రి ఆర్ధిక నిపుణులు జోస్యం చెప్పారు. ఆ తర్వాత మాస్టర్ కార్డ్, వీసా వంటివి కూడా క్రిప్టోకు లేదా బిట్ కాయిన్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే… ఈ మధ్య ఎలాన్ మస్క్ తన ట్వీట్లలో డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ గురించి పోస్టులు పెట్టడం మనం చూశాం. మస్క్ ట్వీట్ అండతో డోజీకాయిన్ చాలా ఫేమ్ అయ్యింది. ఇదిలావుంటే.. డీజీలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి డాగీ కూాడా పరుగులు పెడుతోంది. టెస్లా డోజీకాయిన్ చెల్లింపులను స్వీకరించవచ్చా? అని మస్క్ ఈ మధ్య ట్వీట్ చేశారు. దీంతో ఆయన బిట్‌కాయిన్‌కు బదులు డోజీకాయిన్వైపు ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. ఇక తాజాగా బిట్ కాయిన్ పడిపోవడంతో డీజీ కాయిన్ పరుగులు పెడుతోంది.